నిజామాబాద్, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాకు నూతనంగా బిసి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ (ఉమెన్) మరియు బిసి రెసిడెన్షియల్ స్కూల్ (బాయ్స్), కామారెడ్డి జిల్లా కు బిసి గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు కావడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్సం వ్యక్తం చేశారు. నూతనంగా మంజూరు అయిన ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మరియు బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఏ వర్గానికి చెందిన పేద విద్యార్థులు అయిన ఉన్నతమైన నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసించాలనేది కేసీఆర్ కోరిక అని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ 296 ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా 542 రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు చేశారన్నారు.
అలాగే తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 161 బిసి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండగా వాటిని 280 కి పెంచటం జరిగిందని, వీటిలో చాలా స్కూల్స్ ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై సుమారు 1 లక్ష 20 వేల రూపాయలు ఖర్చు పెడుతూ విద్యార్థులకు ఉన్నతమైన నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడమే కాకుండా వారిని పోటీ ప్రపంచాన్ని తట్టుకొని నిలబడేలా తయారు చేస్తుందన్నారు.
ఈ సందర్భంగా అడగాగానే మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కి మంత్రి ఉమ్మడి జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.