కామారెడ్డి, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం రామరెడ్డి మండల పరిధిలో గల గొల్లపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే సురేందర్ అందజేసిన నూతన ఆసరా ఫించన్ కార్డ్స్‌తో పాటు ఇంతకు ముందున్న ఆసరా ఫించన్ లబ్ధిదారులకు కూడా నూతన ఆసరా ఫింఛన్ కార్డులు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రామరెడ్డి మండల వైస్ ఎంపీపీ రవిందర్ రావు, గ్రామ సర్పంచ్ లావణ్య మల్లేష్ ఆసరా ఫించన్ లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు.
వైస్ ఎంపీపీ మాట్లాడుతూ గ్రామ ప్రజలు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలలో భాగంగా నూతన కార్డులు ప్రతీ ఒక్కరు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికి అందేలా చూస్తామన్నారు. గ్రామ సర్పంచ్ లావణ్య మల్లేష్ మాట్లాడుతూ తమ గ్రామంలో ఇంకా కొంత మందికి ఆసరా ఫించన్లు అర్హులైన వారందరికీ వచ్చే విధంగా చూడాలన్నారు. గ్రామ అభివృద్ధి పనులు సీసీ రోడ్లు, డ్రైనేజి పనులకు నిధులు కేటాయించాలని కోరారు.
అనంతరం రిలయన్స్ ఫౌండేషన్ వారు గ్రామ పరిధిలో గల గొల్లపల్లి, పోసానిపెట్, రామరెడ్డి శివార్లలోని వాగు దగ్గర చెక్ డ్యామ్ మంజూరు చేశారు. దాదాపు రెండులక్షల రూపాయలతో నిధులను కేటాయించిన రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి సల్లవుద్దీన్కు గ్రామ ప్రజల తరపున గ్రామ సర్పంచ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్సయ్య, వార్డు సభ్యులు, సెక్రెటరీ జనార్దన్, రాజయ్య, మల్లయ్య, లింగం, శ్రీనివాస్, భూమయ్య, బలరాజ్, స్వచ్ఛ భారత్ మధు, కృష్ణ, నారాయణ, గ్రామ తెరాస ఉపాధ్యక్షుడు నరేష్, గ్రామ పెద్దలు, యువకులు అనిల్, సుమన్, గ్రామ ప్రజలు, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.