కామారెడ్డి, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంలో కామారెడ్డి జిల్లా రెండవ స్థానంలో ఉందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శుక్రవారం ఐకెపి అధికారులతో రుణాల లక్ష్యాలు, బకాయిల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షకు హాజరైన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడారు. స్త్రీ నిధి రుణాలు అర్హత గల సంఘాలకు ఇప్పించాలని సూచించారు. అధికారులు సమిష్టిగా కృషిచేసి పాత బకాయిలను వసూలు చేయాలని పేర్కొన్నారు. మండలాల వారీగా బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాల లక్ష్యాలను ఐకెపి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ సాయన్న, ఏపీడి మురళీకృష్ణ, డిపిఎంలు సుధాకర్, రవీందర్, అధికారులు పాల్గొన్నారు.