కామారెడ్డి, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు మేలు జాతి పశుసంతతిని పెంపొందించుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ రుణాలు మహిళలకు ఇప్పించి మేలు జాతి గేదెలను కొనుగోలు చేసే విధంగా అధికారులు చూడాలని కోరారు. పాల దిగుబడి పెంచే విధంగా చూడాలన్నారు. పాలు పితికే యంత్రాలు వినియోగించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో నాలుగు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మేలు జాతి పశువుల సంతతిని పెంపొందించే విధంగా చూడాలని పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా పశు సమర్థక అధికారి డాక్టర్ ఎం భరత్, డెయిరీ కళాశాల డీన్ శరత్చంద్ర, కన్కల్ పాల ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జిల్లా విజయ డెఈరీ మేనేజర్ నంద కుమారి, నాబార్డ్ డిడిఎం నగేష్, ఐకెపిడీపీఎం రమేష్ బాబు, అధికారులు పాల్గొన్నారు.