కామారెడ్డి, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు ఆర్టీసీ కూలి కార్మికుడు దామోదర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఆర్టీసీ కూలి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కామారెడ్డి ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. డిపో మేనేజర్ మల్లేశం రాకపోవడంతో మనస్థాపం చెంది పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు.
పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడనే విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ వచ్చి కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కూలి కార్మికుడు దామోదర్, బాలరాజ్, వెంకటరాజు మాట్లాడుతూ రాజు అనే ఆర్‌టిసి డ్రైవర్ కార్గోలో కార్గో పార్సిల్ స్టార్ట్ అయిన తర్వాత తమపై లేనిపోని ఆరోపణలు చేసి విధుల నుండి తొలగించే ప్రయత్నం చేశాడని, ఆర్టీసీ కూలి కార్మికులను తీసివేయడానికి ఆర్టీసీ డ్రైవర్ రాజు కారణమన్నారు.
గత 30 సంవత్సరాలుగా కామారెడ్డి ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ కూలీ కార్మికులుగా పనిచేయడం జరుగుతుందని కార్గోలో పనిచేస్తున్న రాజు వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కార్గో కాంట్రాక్టర్లు అసలు వ్యక్తులు కొండలరావు, శేఖర్ కానీ వాళ్లు ఉండరు, పెత్తనమంతా డ్రైవర్ రాజు చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు.
ఐడి కార్డు రెన్యూవల్ కొరకు తమ వద్ద 1500 రూపాయలు తీసుకున్నాడని, దయచేసి డ్రైవర్ చిన్నరాజును ఆర్టీసీ డిపో నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. డిపో మేనేజర్ చాలా మంచి వ్యక్తి అని, అతనికి లేనిపోని మాటలు చెప్పడం ద్వారానే మమ్ములను విధుల నుండి తొలగించారన్నారు. కార్యక్రమంలో రాజయ్య, నారాయణ, రాములు, ప్రసాద్, రమేష్, సుదర్శన్, స్వామి, రాజేందర్, లింబాద్రి, బాలయ్య పాల్గొన్నారు.