కామరెడ్డి, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్ -1 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాల్లో శనివారం రాత్రి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 10 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కేంద్రాల్లో ఫర్నిచర్, తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఉండే విధంగా చూడాలన్నారు.
అక్టోబర్ 16న టీఎస్పీఎస్ ద్వారా గ్రూప్-1 పరీక్ష ఉన్నందున పరీక్ష కేంద్రాల్లో సమీపంలో ఉన్న జిరాక్స్ మిషన్లు మూసివేయాలని సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇన్విజిలేటర్లను, చీప్ సూపరిండెంట్లు, లైజినింగ్ అధికారులను నియమించాలని కోరారు.
వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కిష్టయ్య, విద్యుత్తు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.