నందిపేట్, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన ఆహ్మద్ ఖాన్ను టిఆర్ఎస్ మైనారిటీ సెల్ ఆర్ముర్ నాయకులు శనివారం శాలువ, పూలమాలతో సన్మానించారు. ఇటీవల నందిపేట్ గ్రామంలోని అన్ని మజీద్ సభ్యుల సమక్షంలో ఎన్నికలు జరిపి నూతన కార్యవర్గాన్ని మరియు అధ్యక్షునిగా ఆహ్మద్ ఖాన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్బంగా టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉస్మాన్ హజ్రమీ మాట్లాడుతూ మాజీ ఎంపిటిసి అహ్మద్ ఖాన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న నందిపేట్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహాయ సహకారాలతో నందిపేట్ ముస్లిం కమిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని టిఆర్ఎస్ యాక్టివ్ లీడర్ సుమీర్ అహ్మద్ వాగ్దానం చేశారు.
కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ హుస్సేన్, ముస్లిం కమిటీ కార్యదర్శి హుస్నోద్దీన్, మండల ముస్లిం కమిటీ ఫౌండర్ షేక్ గౌస్, జమే మజీద్ కార్యదర్శి నసీర్, సహయ కార్యదర్శి ఇఫ్టేఖరు వార్డు సభ్యుడు రఫిక్ ఖాన్ తదితరులు ఉన్నారు.