కామారెడ్డి, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం కామారెడ్డి జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ గుప్తా ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కామారెడ్డి జిల్లా రైస్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచర్ల లింగం, కామారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గబ్బుల లక్ష్మిపతి, చుక్కాపూర్ ఆలయ కమిటీ డైరెక్టర్ ముత్యపు శ్రీనివాస్‌లకు ఘనంగా సన్మానించారు.
ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందు ఉండడం చాలా సంతోషదాయకమని, ఆర్యవైశ్యులు సామాజిక సేవతో పాటుగా రాజకీయంగా కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ గుప్తా, వాసవి ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షుడు యాద నాగేశ్వర్ గుప్తా, ఐవిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు భాస్కర్ గుప్తా, కోశాధికారి వలిపిశెట్టి లక్ష్మీరాజ్యం గుప్తా, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ చైర్మన్ డాక్టర్ బాలు, అయ్యప్ప ఆలయ కమిటీ శాశ్వత అధ్యక్షుడు చీల ప్రభాకర్ గుప్తా, పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ గుప్తా, సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ అతిమాముల రమేష్ గుప్తా, పందిరి రాజేశం గుప్తా, ప్రధాన కార్యదర్శి మొగిలిపల్లి భూమేష్ గుప్తా, మ్యాడము లింగం గుప్తా తదితరులు పాల్గొన్నారు.