ఆర్మూర్, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ పూర్వ రూపమైన భారతీయ జనసంఫ్‌ు వ్యవస్థాపకులలో ఒకరైన పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 106 వ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ, మండల అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపుర్ క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మొక్కలు నాటి నీరుపోశారు.
కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, ఆదిలాబాద్ ఇంచార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ మాట్లాడుతూ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ పేదరికం నుండి వచ్చిన గొప్ప దేశభక్తుడని, ఈ దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండి ఆదర్శవంతంగా ఉండాలన్న ఆలోచనతో ఏకాత్మత మానవతావాదాన్ని ప్రవచించిన రుషితుల్యులు అన్నారు.
అంతేకాకుండా చంద్రగుప్త చాణక్యుల గాధను, జగద్గురు శంకరాచార్యుల జీవితాన్ని భారత ప్రజానీకానికి అందించిన ఉత్తమ రచయిత అని చారిత్రక వ్యక్తుల స్ఫూర్తితో తన రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా యువతకు అందించిన మహానుభావుడు దీన్‌దయాళ్‌జీ అన్నారు.
భారతీయ జనతా పార్టీకి పూర్వ రూపమైన భారతీయ జన సంఫ్‌ును ఆదర్శవంతమైన రాజకీయపక్షంగా రూపొందించిన జాతీయ నాయకుడని, సమాజానికి తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఆధునిక దధీజీ, నిరహంకార ప్రవృత్తి, నిరాడంబర శైలి ఆయన జీవితానికి పెట్టిన ఆభరణాలని ఇలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశం కోసం, ధర్మం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తూ, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మత మానవతా వాదాన్ని ‘‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’’ అనే రూపంలో ఈ దేశ అభివృద్ధికి మోడీ చేస్తున్న కృషి అనితర సాధ్యమని అన్నారు.
కావున నేటి యువత మరోసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం అవసరముందని అప్పుడే పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కలలుగన్న భారతదేశం అఖండ్ భారత్‌గా మారుతుందని ఈ సందర్భంగా తెలిపారు.
కార్యక్రమంలో కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళి, బిజెపి సీనియర్ నాయకులు శికారి శ్రీనివాస్, యామాద్రి భాస్కర్, భూపేందర్, మీసాల రాజేశ్వర్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు భూసం ప్రతాప్, కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పాలెపు రాజు, బిసి మోర్చ ఆర్మూర్ పట్టణ, మండల అధ్యక్షులు బాసెట్టి రాజ్ కుమార్, విఘ్నేశ్వర్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి మిర్యాల్ కర్ కిరణ్ కుమార్, బీసీ మోర్చ ఉపాధ్యక్షులు బట్టు రాము తదితరులు పాల్గొన్నారు.