కామారెడ్డి, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ శారద మాత శ్రీ అభయాంజనేయ దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 26 నుండి వచ్చే నెల అక్టోబర్ 5 తేదీ వరకు ప్రతిరోజు శ్రీ శారద మాత దేవస్థానంలో ప్రతిరోజు ఉదయం 5.30 నుండి 12.30 నిమిషాల వరకు, సాయంత్రం 6.30 నుండి రాత్రి 9 గంటల వరకు అమ్మవారికి జరిగే హోమ అర్చన, అభిషేక, అన్నదాన సేవలో పాల్గొనే భక్తులు ఉత్సవ కమిటీని సంప్రదించగలరని తెలిపారు.
నిత్య దేవి హోమం, నిత్య అన్నదానం, నిత్య గోత్రనామార్చన చేయడం జరుగుతుందన్నారు. దీర్ఘ సోమంగాల్యం కొరకు వృత్తి వ్యాపార అభివృద్ధి, సంతాన వివాహ ప్రాప్తి, అన్ని రకాల కోరికలు తీరడం కొరకు శ్రీ నవదుర్గ వ్రత పూజ శుక్రవారం ఒక్కరోజు ఈనెల 30వ తేదీ మాత్రమే ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పెంటయ్య, ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి, సభ్యులు వరద కుమార్, నర్సగౌడ్, లింగం, సందీప్, రమేష్, శ్రీనివాస్, గణేష్, రాజ్ గంభీరావు, లక్ష్మణ్ పాల్గొన్నారు.