కామారెడ్డి, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ శారద మాత దేవాలయంలో శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ శారద మాత దేవాలయంలో శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు శారదా దేవి గాయత్రి పంచముఖాలతో జగతికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న దేవతగా కామారెడ్డి జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి నవగ్రహాల మహా క్షేత్రం అందరిని ఆకట్టుకుంటుందని ఆలయ ప్రధాన అర్చకులు సతీష్ పాండే తెలిపారు.
గత రెండు రోజులుగా ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, గణపతి పూజ, ప్రతిరోజు మధ్యాహ్నం కుంకుమార్చన నిత్య అన్నదానం, నిత్య హోమం, నిర్వహించడం జరుగుతుందని. ముఖ్యంగా ఈనెల 30వ తారీకు శుక్రవారం ఒకే రోజు నవదుర్గ వ్రతం ఉంటుందని అన్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రతిరోజు పల్లకి సేవ ఉంటుందని శారద మాతను సాక్షాత్తుగా పల్లకి సేవా ద్వారా ఎత్తుకొని మీరు కోరుకునే కోరికలు తీర్చుకోగలరని అన్నారు.
కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు పెంటయ్య, ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి, కోశాధికారి సాయి రెడ్డి, సభ్యులు లింగం, సంగమేశ్వర్, సందీప్, రమేష్, శ్రీనివాస్, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.