నిజామాబాద్, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినత్సవం వేడుకలలో భాగంగా నిజామాబాద్ జిల్లా లోని అన్ని పర్యాటక ప్రదేశాలలో పర్యాటకులను ఆకర్షించే విధంగా వారికి నిజామాబాద్ జిల్లా పర్యాటక ప్రదేశాలపై అవగాహన కల్గించే విధముగా ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు.
అదేవిధముగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ బాలుర వసతి గృహాలకు చెందిన 50 మంది బాలురను జిల్లాలోని అన్ని పర్యాటక ప్రదేశాలు చూడటానికి వీలుగా ఒక బస్ ఏర్పాటు చేసి వారికి అన్ని వసతులు కల్పించి పర్యాటక ప్రదేశాలు చూడటానికి పంపించారు. బస్ టూర్‌ను జిల్లా అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్ ప్రారంభించారు.