నిజామాబాద్, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న కార్మికులందరికీ జీవో 60 ప్రకారం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది వేతనాలు పెంచాలని ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కార్మికులందరికీ జాతీయ పండగ ఆర్థిక సెలవులు ఇవ్వాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు పి. సుధాకర్ ఏఐటీయూసీ నాయకులు హనుమాన్లు, సాయి, యూనియన్ నాయకులు ఎస్ కవిత, భారతి, బాకర్,గంగాధర్, శీను మరియు కార్మికులు పాల్గొన్నారు.