ఉపాధి భద్రతతో కూడిన సమగ్ర చట్టం చేయాలి

బోధన్‌, సెప్టెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన దేశంలో, రాష్ట్రంలో హమాలీల స్థితిగతుల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం సరి కాదని ఐ.ఎఫ్‌. టి.యు జిల్లా సహాయ కార్యదర్శి బి. మల్లేష్‌ తీవ్రంగా విమర్శించారు. బుధవారం తెలంగాణ ప్రగతిశీల హమాలి అండ్‌ మిల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బోధన్‌ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేసి ఏవోకి వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి బి. మల్లేష్‌ మాట్లాడుతూ భారత దేశంలో అసంఘటిత కార్మికులు 42 కోట్ల మంది ఉన్నారని వారి సమస్యలపై కేంద్ర ప్రభుత్వము నియమించిన అర్జున్‌ సేన్‌ గుప్తా కమిషన్‌ కార్మికుల స్థితిగతులపై సమగ్ర పరిశీలన చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని అట్టి నివేదికలో వారికి పౌష్టికాహారం అందడం లేదని, రోజుకు అవసరమైన 2,000 కేలరీల శక్తిలో 4వ వంతు కూడా అందడం లేదని, పౌష్టికాహారం లోపం వల్ల వీరి పిల్లలు మరణిస్తున్నారని, కుటుంబం బ్రతకడానికి కావలసిన ఆదాయంలో నాలుగవ వంతు ఆదాయం మాత్రమే లభిస్తుందని, వీరి స్థితిగతులు మెరుగుపరచవలసిన అవసరాన్ని అర్జున్‌ సేన్‌ గుప్తా కమిషన్‌ నొక్కి చెప్పిందని తెలిపారు.

వీరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలని, వీరి సంక్షేమం పట్ల ప్రభుత్వాలు అశ్రద్ధ వహిస్తున్నాయని, వీరికి చట్టాలు చేసి తగిన చర్యలు చేపట్టాలని కూడా నివేదికలో తేట తేల్లం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక రంగాలలో పనిచేస్తున్న అమాలి కార్మికులు 3 లక్షలకు పైగానే ఉన్నారని, వీరికి ఎటువంటి రక్షణ లేదని వీరి బతుకులు కడు దుర్బరం గా ఉన్నాయని అన్నారు.నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పండ్లు,కాస్మోటిక్‌, సామాగ్రి, విలాస వస్తువులు ఒక చోటు నుండి మరొక చోటికి రవాణా జరగాలంటే హమాలీ కార్మికులు చేసే పనే కీలకమైనది అని అటువంటి వీరి బతుకులు మాత్రం కడు దయనీయంగా ఉన్నాయని వీరి సంక్షేమం గురించి పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయమని బి. మల్లేష్‌ మండిపడ్డారు.

హమాలీల ఉపాధి భద్రతతో కూడిన సమగ్ర చట్టం చేయాలని, వారికి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల వలె హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ తక్షణమే అమలు చేయాలని, వీరికి 50 సంవత్సరాలకే రూ. 4 వేల చొప్పున వృద్ధాప్య పెన్షన్‌ ఇవ్వాలని, ప్రమాదంలో మరణించిన, శాశ్వత అంగవైకల్యానికి గురైనటువంటి వారికి పది లక్షల రూపాయలు చెల్లించాలని, పొందిన వారికి ఐదు లక్షలు ఇవ్వాలని, నీలో కార్మికులకు ప్రసూతి సౌకర్యం కల్పించాలని, ఇల్లు లేని హమాలి అండ్‌ మిల్లు కార్మికులకు తలం కేటాయించి ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో ఐఎఫ్‌టియు నాయకులు ప్రవీణ్‌, గంగాధర్‌, హనుమంతు, పోశెట్టి, గంగాధర్‌, రాములు, శ్రీను, శంకర్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, ఏప్రిల్‌ 4, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »