ఆర్మూర్, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూరు మండలం మంథని గ్రామంలో లయన్స్ యూత్ అసోసియేషన్ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 22వ వార్షికోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని యూత్ ప్రతినిధులు తెలిపారు. గురువారం అమ్మవారి యొక్క పల్లకి సేవ, ఊరేగింపు నిర్వహించారు. భవాని స్వాములు, భక్తులు ఆనందంగా నృత్యాలు చేస్తు అమ్మవారిని గ్రామ వీధుల గుండా ఊరేగించారు.

నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారిని అలంకరించారు. అనంతరం స్వాములకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, చుట్టూ పక్క గ్రామాల స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు.