మాక్లూర్, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 67 రోజుల నుండి నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ మండల కేంద్రంలో నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలకు మండల తహసిల్దార్ సంఫీుభావంతో పాటు మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో పేస్కేల్ అమలు చేయడంతో పాటుగా వారసత్వ ఉద్యోగాల కల్పనతో పాటు పెన్షన్ల వ్యవస్థలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు సుమారు ఏడాదిన్నర గడిచినప్పటికీ నెరవేర్చలేదని, ఇకనైనా కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వీఆర్‌ఏలకు తొందర్లో న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని అందుచేత వీఆర్‌ఏలు సమన్వయంతో సమ్మె కార్యక్రమాలను నిర్వహించాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వద్దని వీఆర్‌ఏలకు సూచించారు.
వీఆర్‌ఏలు తమ డిమాండ్ల సాధనకై పోరాటబాట పట్టడంతో వీఆర్వో వ్యవస్థ రద్దుతో పని భారం మీద పడినా కూడా పనిచేస్తూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న వీఆర్‌ఏల న్యాయపరమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిమాండ్లు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో మాక్లూర్ మండల తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్, సీనియర్ అసిస్టెంట్, వీఆర్‌ఏ జెఏసి జిల్లా చైర్మన్ గైని దయాసాగర్, జిల్లా సెక్రెటరీ, వేముల సాయన్న, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, చెలిమిల రాములు, సాయినాథ్, నీరడి గంగాధర్, హరిచరణ్ సదానంద్, మండల నాయకులు పాల్గొన్నారు.