దోమకొండ, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బిక్కనూర్, మాచారెడ్డి, రాజంపేట, అన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి టీబీ ముక్తాభారత్ అభియాన్ నిక్షేయ మిత్రపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సమన్వయకర్త నీలిమ మాట్లాడారు.
జిల్లాలో 1113 మంది వ్యాధిగ్రస్తులను గుర్తించామని తెలిపారు. ప్రధానమంత్రి టీబీ ముక్తభారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫుడ్ బాస్కెట్ ఒక్కొక్క వ్యాధిగ్రస్తునికి ఆరు నెలల పాటు సహకారం అందించే బృహత్తోరమైన కార్యక్రమం తీసుకోవడం అభినందనీయమన్నారు.
దాతలు వ్యాధిగ్రస్తులకు అండగా నిలుస్తున్నారన్నారు. 2025 నాటికి టీబీ అంతానికి కృషి చేయవలసిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమన్వయకర్త శోభారాణి, వైద్యులు నవీన్ కుమార్, చంద్రమౌళి, రాము, సతీష్, సింధు, దాతలు, అధికారులు పాల్గొన్నారు.