లింగంపేట్, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపేట్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో గురువారం నూతన బోరుబావి పనులు ప్రారంభించినట్లు తెరాస మండల అధ్యక్షులు రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్ పునర్నిర్మాణ పనుల నిమిత్తం ఎమ్మెల్యే జాజుల సురేందర్ నలభై ఆరు లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఇందులోభాగంగానే బోరుబావి తవ్వకం పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
ఈసందర్భంగా టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌కు, ఎమ్మెల్యే జాజల సురేందర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బస్టాండ్ పునర్నిర్మాణ పనులు పూర్తయితే లింగంపేట్ బస్టాండ్ దశ పూర్తిగా మరిపోనున్నదని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోని నిర్లక్ష్యనికి గురైన లింగంపేట్ బస్టాండ్ ఎమ్మెల్యే సురేందర్ చొరవతో దశ దిశ పూర్తిగా మరిపోనున్నదని అన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, ఎంపీపీ గరీబున్నిసా నాయిమ్, సమయం జడ్పిటిసి శ్రీలత సంతోష్ రెడ్డి, ఎఎంసి వైస్ చైర్మన్ నరహరి, ఎంపీటీసీ శమిమున్నిసా ఫతియోద్దీన్, మాజీ ఎంపీ ముదం సాయిలు, ఉపసర్పంచ్ రవీందర్, మోతె సర్పంచ్ రాంరెడ్డి, అట్టెం శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు నరేష్, నేతలు రాజు, యువ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, సాయిలు, షాదిక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.