కామారెడ్డి, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థుల చేతులు శుభ్రంగా ఉంచుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్‌లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
వసతి గృహాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కిచెన్‌షెడ్, స్టోర్‌రూమ్, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. పైప్‌లైన్ లీకేజీలు లేకుండా చూడాలన్నారు. వసతి గృహాల ఆవరణలో మురుగునీరు నిలువ లేకుండా చూసుకోవాలని కోరారు.
విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణలో గుర్తించిన సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్, ప్రిన్సిపల్ ప్రణీత, విజిలెన్స్ అధికారి జియా, శిక్షకులు వెంకటరాములు, నారా గౌడ్, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.