నిజామాబాద్, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్టోబర్ ఒకటిన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రైల్వే ప్రయాణాలలో సీనియర్ సిటిజన్లకు, మహిళలకు రాయితీలను పునః ప్రారంభించాలని, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి కే.రామ్మోహన్రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా తెలంగాణ ఆర్టీసీలో కూడా ప్రయాణాలలో రాయితీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రలో ఆర్టీసి ప్రయాణాల్లో రాయితీలు ఆయారాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయని అక్టోబర్ ఒకటి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నాటి నుండి అయినా ఈ రాయితీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.