రామారెడ్డి, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగ అందించే బతుకమ్మ చీరలను రామారెడ్డి ఎంపీపీ నారెడ్డి దశరథ రెడ్డి పంపిణి చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి బడుగు బలహీన వర్గాలు సైతం పండుగ రోజు సంతోషంగా నూతన దుస్తులు వేసుకొని ఆనందంగా పండుగ జరుపుకునేలా కుల మతాలకు అతీతంగా ప్రభుత్వం ఆడపడుచులందరికి చీరలను అందిస్తుందన్నారు.
పండగను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ లాంటివి ఆడపడుచులకు మన ప్రభుత్వం అందిందన్నారు. అంతేకాకుండ బీడీ కార్మికులకు, ఒంటరి మహిళా సోదరి మణులకు కూడా ఆసరా పెన్షన్‌లు అందిస్తున్న భారత దేశంలో ఏకైక రాష్ట్రము మన తెలంగాణ అన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ లావణ్య మల్లేష్ మాట్లాడుతూ తమ గ్రామము జిల్లాలో చాలా చిన్నది అయినప్పటికి తమ గ్రామాన్నీ అభివృద్ధి పథములో నడిచేందుకు తోడ్పడుతున్న రామరెడ్డి మండల ఎంపీపీ దశరత్ రెడ్డికి గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రవిందర్రావు, సర్పంచ్ లావణ్య మల్లేష్, ఉపసర్పంచ్ నర్సయ్య, వార్డు సభ్యులు, సెక్రెటరీ జనార్దన్, గ్రామ తెరాస అధ్యక్షుడు రెడ్డి మల్లేష్, గ్రామ సిఏ నవిత, ఆశ వర్కర్ లక్మి, గ్రామ ఐకేపీ డ్వాక్రా మహిళల సంఘాల సభ్యులు, బతుకమ్మ చీరల లబ్దిదారులు, గ్రామపెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.