కామారెడ్డి, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకమ్మ పండుగ తెలంగాణలో వారసత్వంగా వస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో శుక్రవారం టీఎన్జీవోస్, ఉద్యోగుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
పూలను పూజించే పండగ బతుకమ్మ అని తెలిపారు. బతుకమ్మను తొమ్మిది రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం అవకాశమిచ్చిందని చెప్పారు. మహిళలు, చిన్నారులు సంతోషంగా సంబరాల్లో పాల్గొనాలని సూచించారు. మహిళలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అందంగా పేర్చిన బతుకమ్మలకు బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిఆర్‌డిఓ సాయన్న, సిపిఓ రాజారాం, ప్రతినిధులు దేవేందర్, దేవరాజు, సాయి రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.