కామారెడ్డి, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మగ్గం శిక్షణ పొందిన మహిళలు ప్రతి ఒక్కరు స్వయం ఉపాధి పొంది కుటుంబానికి అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌ఎస్‌ఈటిఐ), డిఆర్‌డిఓ కామారెడ్డి ఆధ్వర్యంలో మగ్గం శిక్షణ ముగింపు సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు.
మగ్గం శిక్షణతో ఉపాధి అవకాశాలు ఉన్నాయని సూచించారు. మగ్గం వర్క్ చేసిన బ్లౌజులు ప్రస్తుతం మహిళలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని చెప్పారు. మహిళలకు స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇప్పిస్తామన్నారు. ఈ సందర్భంగా మగ్గం స్టాండ్ టూల్ కిట్స్, ధ్రువీకరణ పత్రాలు మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ సాయన్న, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ డైరెక్టర్ కృష్ణ, జెడిఎం హిమాబాల, సమన్వయకర్త రామకృష్ణ , మహిళలు పాల్గొన్నారు.