Monthly Archives: September 2022

టీయూలో కాళోజి జయంతి

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఆర్ట్స్‌ కళాశాలలోని మిని సెమినార్‌ హాల్‌లో కాళోజీ జయంతిని ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్‌ ఆచార్య ఆరతి పెర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజిష్ట్రార్‌ ఆచార్య విద్యావర్ధిని విచ్చేసి తెలంగాణ భాషాభివృద్ధికి కాళోజి చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతిని తెలంగాణ భాసా దినోత్సవంగా పాటించడం అభినందనీయమన్నారు. ముఖ్య వక్తగా విచ్చేసిన ఆచార్య కనకయ్య …

Read More »

సార్వజనిక్‌ గణేష్‌ మండలి వద్ద కలెక్టర్‌ పూజలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం దుబ్బ ప్రాంతంలోని సార్వజనిక్‌ గణేష్‌ మండలి వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక నిమజ్జన శోభాయాత్ర రథం వద్ద టెంకాయ కొట్టారు. ఈ సందర్భంగా సార్వజనిక్‌ గణేష్‌ మండలి అధ్యక్షుడు బంటు గణేష్‌ ఇతర ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు కలెక్టర్‌కు …

Read More »

న్యూ కలెక్టరేట్‌లో ప్రజాకవి కాళోజీ జయంతి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు 108వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం (న్యూ కలెక్టరేట్‌) కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం, కాళోజీ చిత్రపటానికి పూలమాలలు …

Read More »

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న వర్గం వెంకటేష్‌ (35) నార్సింగ్‌కు అత్యవసరంగా ఓ పాజిటివ్‌ ప్లేట్‌లెట్స్‌ అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన దినేష్‌ గౌడ్‌ స్పందించి సకాలంలో రక్త కణాలను అందజేశారని ఐవిఎఫ్‌ తెలంగాణ రక్తదాతల సమన్వయకర్త, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి సకాలంలో …

Read More »

ఘనంగా కాళోజీ జయంతి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ వైతాళికుడు, ప్రజా కవి, కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా గాజుల్‌ పెట్‌లోని కాళోజీ విగ్రహానికి నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై తన కవిత్వాల ద్వారా ప్రజలలో ఏర్పాటు ఆవశ్యకతను చేరవేసి మన …

Read More »

సేవాభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయులు సేవాభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. పిట్లం మండల కేంద్రంలోని సాయి గార్డెన్‌లో జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు నిరంతరం శ్రద్ధ పెట్టి …

Read More »

గిరిరాజ్‌ కళాశాలలో తెలంగాణ భాషా దినోత్సవం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం తెలుగు విభాగం ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 108వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవాన్ని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి. రామ్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భాష- యాసను కాళోజి తన కవిత్వం ద్వారా బతికించిన విధానాన్ని లఘు చిత్రం (డాక్యుమెంటరీ) రూపంలో ప్రదర్శించారు. సభాధ్యక్షులు ప్రిన్సిపాల్‌ …

Read More »

బ్యాంకర్ల తీరుపై కలెక్టర్‌ అసంతృప్తి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంట రుణాల పంపిణీలో బ్యాంకర్లు అలసత్వ వైఖరి ప్రదర్శించడం పట్ల కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అసంతృప్తి వెలిబుచ్చారు. నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనప్పటికీ పంటల సాగు కోసం అవసరమైన రుణాలను రైతాంగానికి పంపిణీ చేయడంలో పలు బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నాయని అన్నారు. ఏది ఎంతమాత్రం సమంజసం కాదని, పనితీరు మార్చుకొని పక్షంలో జిల్లా యంత్రాంగం తరపున కఠిన …

Read More »

జనహిత గణేష్‌ మండలి లడ్డూ వేలం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌ జనహిత గణేష్‌ మండలి గణపతి లడ్డు ధర రూ.17 500 పలికింది. గురువారం గణపతి లడ్డుకు వేలంపాట నిర్వహించారు. లడ్డు దక్కించుకోవడానికి ఇద్దరు ఉద్యోగులు పోటీపడ్డారు. జిల్లా ఎడి మైన్స్‌ అధికారి నర్సిరెడ్డి రూ.17,000 పాడారు. చివరకు టీఎన్జీవోఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. సాయిలు రూ.17,500 పాడి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా సాయిలును …

Read More »

ఓయులో రెండురోజుల వర్క్‌షాప్‌

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థులకు ప్రపంచ ఉపాధి, విద్యావకాశాలను సృష్టించేందుకు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఫ్రెంచ్‌ను ద్వితీయ భాషా సిలబస్‌గా సవరించాలని నిర్ణయించింది, కామన్‌ యూరోపియన్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ రెఫరెన్స్‌ ప్రకారం రూపొందించిన అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఏకరీతి సిలబస్‌ను ప్రారంభించింది. సవరించిన సిలబస్‌ ఉపయోగించాల్సిన బోధనా సాధనాలపై ఫ్రెంచ్‌ భాషా ఉపాధ్యాయులకు నైపుణ్యాన్ని పెంపొందించడానికి, చైర్మన్‌, టిఎస్‌సిహెచ్‌ఇ 2022 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »