Monthly Archives: September 2022

శ్రీ ఆర్యబట్ట కళాశాలలో బతుకమ్మ సంబరాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల శ్రీ ఆర్యభట్ట గ్రూప్‌ ఆఫ్‌ కాలేజెస్‌ ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ పువ్వులతో అలంకరించిన బతుకమ్మలను తయారుచేసి, డీజే చప్పుల మధ్య సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. నృత్యాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ చైర్మన్‌ గడ్డం …

Read More »

కన్నుల పండువగా అమ్మవారి ఊరేగింపు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూరు మండలం మంథని గ్రామంలో లయన్స్‌ యూత్‌ అసోసియేషన్‌ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 22వ వార్షికోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని యూత్‌ ప్రతినిధులు తెలిపారు. గురువారం అమ్మవారి యొక్క పల్లకి సేవ, ఊరేగింపు నిర్వహించారు. భవాని స్వాములు, భక్తులు ఆనందంగా నృత్యాలు చేస్తు అమ్మవారిని గ్రామ వీధుల గుండా ఊరేగించారు. నవరాత్రి …

Read More »

ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా నిలిపినందుకు శుభాకాంక్షలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌, ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ (ఐవిఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌ గుప్తాకు తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా 4 అవార్డులను అందుకున్నందుకుగాను శుభాకాంక్షలు తెలిపామని ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త బాలు, గంప ప్రసాద్‌ అన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ఉప్పల …

Read More »

స్థలం కేటాయించారు… నిర్మాణం మరిచారు…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 13 వార్డ్‌ టేక్రియల్‌లో స్మశాన వాటిక నిర్మాణం జరగడం లేదంటూ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేడుదుల రాజు, గడ్డ మీది రాజు, రాములు, ఆంజనేయులు మాట్లాడుతూ సంవత్సరాలు గడిచిపోతున్నా అధికారులు స్మశాన వాటిక నిర్మాణం విషయం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలు గడుస్తున్న స్థానిక కౌన్సిలర్‌ …

Read More »

డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలి

మాక్లూర్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 67 రోజుల నుండి నిజామాబాద్‌ జిల్లాలోని మాక్లూర్‌ మండల కేంద్రంలో నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలకు మండల తహసిల్దార్‌ సంఫీుభావంతో పాటు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తహసిల్దార్‌ శంకర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా అసెంబ్లీలో పేస్కేల్‌ అమలు చేయడంతో పాటుగా వారసత్వ ఉద్యోగాల కల్పనతో పాటు …

Read More »

రికార్డుల నిర్వహణ సజావుగా చేపట్టాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రికార్డుల నిర్వహణ సజావుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు గురువారం వీఆర్వోలకు ఓరియంటేషన్‌ శిక్షణ నిర్వహించారు. శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఇంటి పన్నులు వసూలు చేయడంలో ప్రత్యేక అధికారులు (వీఆర్వోలు) కీలక పాత్ర పోషించాలని సూచించారు. లేఅవుట్‌, బిల్డింగ్‌ అనుమతులను తీసుకునే విధంగా పట్టణ వాసులకు అవగాహన …

Read More »

ఆధునిక పద్దతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శిక్షణలో నేర్చుకున్న విజ్ఞానాన్ని రైతులకు అందించవలసిన బాధ్యత డీలర్ల దేనని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డిప్లమా ఇన్‌ అగ్రికల్చర్‌ ఎక్స్టెన్షన్‌ సర్వీసెస్‌ ఫర్‌ ఇన్పుట్‌ డీలర్స్‌ రెండో బ్యాచ్‌ శిక్షణను గురువారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు ఆధునిక పద్ధతులు …

Read More »

ఉపాధి భద్రతతో కూడిన సమగ్ర చట్టం చేయాలి

బోధన్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన దేశంలో, రాష్ట్రంలో హమాలీల స్థితిగతుల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం సరి కాదని ఐ.ఎఫ్‌. టి.యు జిల్లా సహాయ కార్యదర్శి బి. మల్లేష్‌ తీవ్రంగా విమర్శించారు. బుధవారం తెలంగాణ ప్రగతిశీల హమాలి అండ్‌ మిల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బోధన్‌ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేసి …

Read More »

మిషన్‌ భగీరథకు కేంద్రప్రభుత్వ అవార్డు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథకు కేంద్రప్రభుత్వ అవార్డు ప్రకటించింది. ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న మిషన్‌ భగీరథ పథకానికి మరోసారి కేంద్రప్రభుత్వ అవార్డు దక్కింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు మానస పుత్రిక అయిన మిషన్‌ భగీరథతో తెలంగాణలోని ప్రతీ ఆవాసంతో పాటు మారుమూల, అటవీ, కొండ ప్రాంతాల్లోని ఏ ఒక్క గిరిజన నివాసాన్ని కూడా వదలిపెట్టకుండా …

Read More »

ప్రాణం తీసిన ఈత సరదా

మేడ్చల్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిర్యాల్‌ గ్రామంలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చిర్యాల్‌ నాట్కం చెరువులో మునిగి చనిపోయారు. హరహరన్‌, ఉబేద్‌ అనే ఇద్దరు విద్యార్థుల బర్త్‌ డే సందర్భంగా.. తొమ్మిది మంది విద్యార్థులు చిర్యాల్‌ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి వెళ్లే సమయంలో సరదాగా ఈత కొట్టేందుకు చిర్యాల నాట్కం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »