Monthly Archives: September 2022

జాలరి మృతి

నందిపేట్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో బోయిగల్లికి చెందిన గూండ్ల గణేశ్‌ ఈనెల 26న చేపలు పట్టడానికి వెళ్ళి 27న సాయంత్రం తాళ్ళ చెరువులో శవమై కనిపించాడని నందిపేట్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించామన్నారు. మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు.

Read More »

దళిత బంధు యూనిట్లను అందజేసిన మంత్రులు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బంధు పథకంలో ప్రత్యేక పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపికైన కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర ఎస్సీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి 140 మంది లబ్ధిదారులకు దళిత బందు యూనిట్లను అందజేశారు. అనంతరం …

Read More »

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 27 ప్రపంచ పర్యాటక దినత్సవం వేడుకలలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా లోని అన్ని పర్యాటక ప్రదేశాలలో పర్యాటకులను ఆకర్షించే విధంగా వారికి నిజామాబాద్‌ జిల్లా పర్యాటక ప్రదేశాలపై అవగాహన కల్గించే విధముగా ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. అదేవిధముగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ బాలుర వసతి గృహాలకు చెందిన 50 మంది బాలురను జిల్లాలోని అన్ని పర్యాటక …

Read More »

జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న కార్మికులందరికీ జీవో 60 ప్రకారం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం తెలంగాణ మెడికల్‌ కాంటాక్ట్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మెడికల్‌ కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి …

Read More »

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పులకు స్వాగతం పలికిన మంత్రి వేముల

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఘన స్వాగతం పలికారు. రైతులు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులను మంత్రి కొప్పులకు వేముల పరిచయం చేశారు. …

Read More »

తెలంగాణ సమాజంలో వెలిసిన ఆణిముత్యం ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ సమాజంలో వెలిసిన ఆణిముత్యం అని జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి కొనియాడారు. ఆయన ఆశలు, ఆశయాల సాధన కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ 107 వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల …

Read More »

కామారెడ్డి శారదామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ శారద మాత దేవాలయంలో శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్‌ బోర్డు కాలనీ శ్రీ శారద మాత దేవాలయంలో శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు శారదా దేవి గాయత్రి పంచముఖాలతో జగతికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న దేవతగా కామారెడ్డి జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి నవగ్రహాల మహా …

Read More »

ముదెల్లిలో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

గాంధారి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్‌ నిధుల నుండి గాంధారి మండలం ముద్దెల్లి గ్రామానికి రూ.15 లక్షల సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మంజూరు చేశారు. కాగా మంగళవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్‌ పిట్ల కళావతి-లక్ష్మణ్‌తో కలిసి ఎంపీపీ రాధబలరాం నాయక్‌, జడ్పీటీసీ శంకర్‌ నాయక్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ముద్దెల్లి సొసైటీ ఛైర్మన్‌ సాయిరాం, స్థానిక …

Read More »

సకాలంలో ప్లేట్‌లెట్స్‌ అందజేసి ప్రాణాలు కాపాడిన శ్రీనివాస్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆశ్రాన్‌ ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. డెంగ్యూ వ్యాధితో తెల్ల రక్తకణాల సంఖ్య పడిపోవడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాస్‌ మానత దృక్పథంతో వెంటనే స్పందించి కెబిసి రక్తనిధి కేంద్రంలో బి పాజిటివ్‌ ప్లేట్‌లెట్స్‌ను అందజేసి ప్రాణాలు కాపాడారని ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల రెడ్‌క్రాస్‌ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త …

Read More »

అడవుల రక్షణతోనే భావితరాలకు మేలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనుల దరఖాస్తులను ఈనెల 28 నుంచి పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు మంగళవారం ఆయన మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అక్టోబర్‌ 28 లోగ పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రతి మండలంలో 6 నుంచి 8 బృందాలను ఏర్పాటు చేసి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »