Monthly Archives: October 2022

పిచ్చికుక్క దాడిలో 20 మందికి గాయాలు

బోధన్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ మండలం లంగ్డాపూర్‌ గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. పిచ్చి కుక్క జనాలపై దాడి చేస్తూ కనబడ్డవారిని కరిచేస్తూ తీవ్ర ఆందోళన కలిగించింది. పిచ్చికుక్క దాడిలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు వారి బందువులు హాజరు …

Read More »

సమాచార శాఖ (ఏ.ఆర్‌.ఈ) ఏఈఐఈకి ఘనంగా వీడ్కోలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ (ఏ.ఆర్‌.ఈ) విభాగంలో సహాయ ఎగ్జిక్యూటివ్‌ సమాచార ఇంజనీర్‌ (ఏఈఐఈ)గా విధులు నిర్వర్తించి సోమవారం పదవీ విరమణ చేసిన వీ.కరుణశ్రీనివాస్‌ కుమార్‌కు ఆ శాఖ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. దాదాపు ముప్పై సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించిన కుమార్‌, ఏడాదిన్నర కాలం పాటు ఇంకనూ తన సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ …

Read More »

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును పరిశీలించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును నిశితంగా పరిశీలించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అఖిల భారత సర్వీసుల ట్రైనీ అధికారులకు సూచించారు. తమ శిక్షణలో భాగంగా క్షేత్ర స్థాయిలో వివిధ అంశాల అధ్యయనం కోసం నిజామాబాద్‌ జిల్లాకు కేటాయించబడిన అఖిల భారత సర్వీసుల ట్రైనీ అధికారుల బృందం సోమవారం సమీకృత …

Read More »

ప్రజావాణికి 72 ఫిర్యాదులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 72 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, జెడ్పి సీఈఓ గోవింద్‌లకు విన్నవిస్తూ అర్జీలు …

Read More »

దేశ సమైక్యతకు చిహ్నం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత దేశపు ఐక్యతకు చిహ్నంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ దేశ చరిత్రలో చిర స్థాయిలో నిలిచిపోతారని ఏసిపి వెంకటేశ్వర్లు అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఐక్యతా పరుగును 7వ పోలీసు బెటాలియన్‌ కమాండెంట్‌ శ్రీనివాసరావుతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న …

Read More »

మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే..

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న టేక్రియాల్‌ గ్రామానికి చెందిన నారాయణరావుకు అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ క్రియాశీలక సభ్యుడు పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన పెంజర్ల సురేష్‌ రెడ్డి వెంటనే స్పందించి పట్టణంలోని మెడికల్‌ ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న లింగాపూర్‌ గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి సహకారంతో ఏ …

Read More »

ఆలయ భూమిపై కబ్జా కన్ను

కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కున్నారు… ఇలాంటి సంఘటన కామారెడ్డి మండలం ఉగ్రవాయిలో చోటు చేసుకుంది. గత 10 సంవత్సరాల క్రితం గ్రామస్తులందరూ ఏకమై శివాలయం కోసం భూమిని కేదార్నాథ్‌ అనే పీఠాధిపతిపై గ్రామస్తులు అందరు కలిసి సర్వే నెంబర్‌ 155/9 లో ఒక ఎకరం 13 గుంటల భూమిని సర్వే నెంబర్‌ …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, అక్టోబర్ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి న్యాయం …

Read More »

వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పథకాలు షెడ్యూల్డ్‌ కులాల వారికి అందే విధంగా మానిటరింగ్‌ కమిటీ ప్రతినిధులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు సోమవారం షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలోని షెడ్యూల్డ్‌ కులాల వారికి …

Read More »

జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేసిన అధికారులు

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యత ప్రతిజ్ఞను చేపట్టారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ ప్రతిజ్ఞ చదివి వినిపించారు. జిల్లా ఉద్యోగులు ముందుకు చేతులు చాచి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »