కామారెడ్డి, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతిబింబంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో శనివారం మెప్మా, మున్సిపల్ సిబ్బంది, పిఆర్‌టియు ఉపాధ్యాయునీల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
తెలంగాణ ప్రజలు ఆడబిడ్డగా కీర్తించే గౌరమ్మకు అరుదైన గౌరవం బతకమ్మ పండగ తీసుకువచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బతకమ్మ పండుకు తగిన గుర్తింపును ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మలను అందంగా పేర్చిన మహిళలకు బహుమతులను ప్రధానం చేశారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, డిఆర్‌డిఓ సాయన్న, వ్యాఖ్యాత మనోహర్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, పిఆర్టియు ప్రతినిధులు స్వప్న, సంతోష్ కుమార్, రాజు పాల్గొన్నారు.