కామారెడ్డి, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాములను శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించారు. సీసీటీవీ కెమెరాలను చూశారు. పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల సూపరింటెండెంట్ సాయి భుజంగరావు, అధికారులు ఉన్నారు.