నిజామాబాద్, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 27వ డివిజన్ ఆనంద్ నగర్లో 10లక్షల జనరల్ ఫండ్‌తో చేపట్టే సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణతో కలిసి నగర మేయర్ దండు నీతూకిరణ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లో అంతర్గత రోడ్లు, మురికి కాలువల నిర్మాణమే తక్షణ కర్తవ్యంగా పనులు చేస్తున్నామని ఎక్కడా కూడా నిధుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు నగర అభివృద్ధికై కృషి చేస్తున్న నగర ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ బట్టు రాఘవేందర్, మున్సిపల్ ఇంజినీర్ ఇనాయత్ కరీం, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.