కామారెడ్డి, అక్టోబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన జ్యోతి ఓ ప్రైవేట్ వైద్యశాలలో డెంగ్యూ వ్యాధితో చికిత్సపొందుతుంది. తెల్ల రక్తకణాల సంఖ్య పడిపోవడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన స్ఫూర్తి డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు బంధం ప్రవీణ్‌కు తెలియజేయడంతో మానత దృక్పథంతో వెంటనే స్పందించి కెబిసి రక్తనిధి కేంద్రంలో ఓ పాజిటివ్ ప్లేట్ లెట్స్‌ను అందజేసి ప్రాణాలను కాపాడారని ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల రెడ్‌క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
అధ్యాపకుడు బంధం ప్రవీణ్ గతంలో కూడా చాలా సందర్భాలలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం, ప్లేట్ లెట్స్ దానం చేయడం ఎంతో ఆదర్శనీయమని వీరికి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కామారెడ్డి జిల్లా కలెక్టర్ రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధితో చాలామంది వివిధ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని వారికి కావలసిన తెల్లరక్త కణాలను అందజేయడానికి దాతలు ముందుకు రావాలని, సకాలంలో అందజేయకపోతే వారి ప్రాణాలు పోవడం జరుగుతుందన్నారు. కుటుంబ సభ్యులు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు. కార్యక్రమంలో కేబిసి బ్లడ్‌బ్యాంక్ సిబ్బంది జీవన్, టెక్నీషియన్లు పాల్గొన్నారు.