కామారెడ్డి, అక్టోబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్ హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ మాట్లాడారు.
ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి ,సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జనహిత ద్వారా ఆన్లైన్లో వచ్చే ప్రతీ దరఖాస్తును అధికారులు పరిశీలించాలని సూచించారు. పెండిరగ్ దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఆర్డిఓ సాయన్న ,ఏవో రవీందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.