నిజామాబాద్, అక్టోబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మధ్యాహ్న భోజన పనివారికి దసరా పండగ వెళ పస్తులే ప్రభుత్వం మిగిల్చిందని, అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టు పరిస్థితి ఉందని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోపునూరు చక్రపాణి అన్నారు. మంగళవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
9వ, 10వ తరగతి విద్యార్థుల మధ్యాహ్న భోజన కార్యక్రమం కోడిగుడ్డు కోసం బడ్జెట్ రూ. 3 కోట్ల 4 లక్షల 49 వేల 500 లు ప్రభుత్వం సెప్టెంబర్ 19న విడుదల చేసిందని, కానీ ఎస్‌టివోలో బిల్లులు పాసవకపోవడానికి కారణం ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించుట వలన ఏ బిల్లూ విడుదల కాక ఎండిఎం వర్కర్స్‌కు పండగ పూట ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బు రాక పస్తులే అయిందని అన్నారు.
కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ఫ్రీజింగ్ ఎత్తివేసి కోడిగుడ్డు బిల్లు పాసయ్యేలా చూడాలని కోరారు. లేనియెడల ఈనెల 10 నుండి ఎండిఎం వర్కర్స్ సమ్మెకు వెళ్లనున్నట్టు ప్రభుత్వానికి హెచ్చరించారు. కార్యక్రమంలో ఎండిఎం జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి తదితరులున్నారు.