నిజామాబాద్, అక్టోబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా పాలనాధికారి సి.నారాయణ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయ దశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం సఫలీకృతం కావాలని మనసారా కోరుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, దుర్గామాతా కరుణాకటాక్షాలతో అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని అభిలషించారు.