కామారెడ్డి, అక్టోబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండా గ్రామంలో జాహిరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీపాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ సహకారంతో 1.50 లక్ష యాభై వేల రూపాయలతో గ్రామం మధ్యలో ఏర్పాటు చేసిన హెమక్స్ లైట్స్‌ను రామారెడ్డి ఎంపీపీ దశరథ రెడ్డి, ఉమ్మడి సదాశివనగర్ మాజీ జడ్పీటీసీ పడిగేల రాజేశ్వర్ రావుతో కలిసి ప్రారంభించారు.
స్థానిక సర్పంచ్ లలిత లింబాద్రి, స్థానిక ఎంపీటీసీ ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతు తమ సమస్యను తెలుసుకొని ఎంపి బిబి పాటిల్ దృష్టికి తీసుకువెళ్లి వారి నిధుల నుండి హె మాక్స్ లైట్స్ ఇప్పించినందుకు మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావుకి, ఎంపీపీ దశరథ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావు మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రం వచ్చినంక తండాలని గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనచరిత్ర కేవలం కేసీఆర్‌కి మాత్రమే దక్కిందన్నారు.
గిరిజనులు స్వపరిపాలన చేసుకోవాలని ప్రత్యేక గ్రామ పంచాయతీలని ఏర్పాటు చేశారన్నారు. అంతేకాదు 10 శాతం గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించిన అభినవ అంబేద్కర్ కెసిఆర్ మాత్రమే అని కొనియాడారు. ఎంపిపి మాట్లాడుతూ అది త్వరలోనే అన్ని గ్రామాలకు అత్యాధునిక నైపుణ్యంతో ఐమాక్స్ లైట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉప్పల్వాయి గ్రామంలో ఎంపీటీసీ సభ్యులు ఉమా దేవి దత్తాత్రేయ అడిగిన వెంటనే ఐమాక్స్ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం లైట్స్ వెలుగుతున్నాయని అది కూడా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అతి తొందర్లోనే ప్రారంభం చేస్తామన్నారు.
అలాగే మోషన్ పూర్, పోసానిపేట్, రామారెడ్డి కన్నాపూర్, గిద్ద, ఇస్సాన్నపల్లి, గొల్లపల్లి, రంగంపేట్, గ్రామాలలో ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో అడ్లూర్ ఎల్లారెడ్డి వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు మర్రి సదాశివారెడ్డి, వైస్ ఎంపీపీ రవీందర్ రావు, మోషంపూర్ దత్తాన్న, ఉప సర్పంచ్ తిరుపతి, బాల్య, తదితరులు పాల్గొన్నారు.