కామారెడ్డి, అక్టోబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జేఏసీ ఆధ్వర్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకం (గ్రామీణ అభివృద్ధి శాఖ) లోని విభాగాలైన సెర్ప్, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో సెర్ప్ ఉద్యోగులకు టైం స్కేల్ వర్తింపచేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
గత 17 సంవత్సరాల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటర్ షెడ్స్, ఇందిరా ప్రభ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఏపీఎంలు, ఈసీలు, టిఏలు వివిధ హోదాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు రాష్ట్రంలో 3,874 మంది ఉన్నారని పేర్కొన్నారు. వినతి పత్రాన్ని డిఆర్డిఓ సాయన్నకు కలెక్టరేట్లో అందజేసినట్లు జేఏసీ కన్వీనర్ ఎం. కృష్ణగౌడ్, కో కన్వీనర్ ధర్మారెడ్డి, హరిబాబు పాల్గొన్నారు.