కామారెడ్డి, అక్టోబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి, ఇంటర్మీడియట్ 2022 వ సంవత్సరంలో జరిగిన పరీక్షల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు అవోపా కామారెడ్డి ఆధ్వర్యంలో కొమ్మ జ్ఞానేశ్వర్ సౌజన్యంతో కామారెడ్డి అవోపా భవనంలో సిల్వర్ మెడల్స్, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవోపా అధ్యక్షులు వుపులపు సంతోష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ భావితరాలకు మంచి సేవలు అందించే పదవులలో నేడు అవార్డు తీసుకున్న విద్యార్థులు స్థిరపడాలని ఆకాంక్షించారు.
అలాగే అవోపా కామారెడ్డి జిల్లాలోని ఆర్యవైశ్య అఫిషియల్స్ మరియు ప్రొఫెషనల్స్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి తృప్తి శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని విద్యాభ్యాసం సాగించాలని కష్టపడి చదివితే విజయం తప్పక సొంతం అవుతుందని పేర్కొన్నారు.
ఆర్థిక కార్యదర్శి గంగా ప్రసాద్ గుప్తా మాట్లాడుతూ కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలలో మెరిట్ అవార్డు ఇవ్వలేకపోయామని విద్య అభ్యసనంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించినట్లయితే వారు సులభంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు.
కార్యక్రమంలో అవోపా కార్యవర్గ సభ్యులు బాలయ్య, రమేష్, మురళి, మహేష్, సంతోష్, రమేష్, ప్రసాద్, శరత్, రమేష్, పవన్, సుధాకర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అవార్డు గ్రహీతలు అవోపా అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాబోయే కాలంలో మీరు ఇచ్చిన స్ఫూర్తితో మరింత ప్రణాళికాబద్ధంగా చదివి విజయాలను సాధిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పదవ తరగతిలో 10 జిపిఏ సాధించిన హాసిక, క్రిష్నవంశీ, శ్రుతి, అనుగ్మ నలుగురు విద్యార్థులకు, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు రన్విత, వైష్ణవి, సంప్రీతివిద్యార్థులకు సన్మానం చేశారు.