కామారెడ్డి, అక్టోబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనిఆవరం మర్కజి మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ ఉన్ నబి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన రెడ్ క్రాస్ జిల్లా సెక్రటరీ బాస రఘుకుమార్, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, డివిజన్ సెక్రెటరీ జమీల్ అహ్మద్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని, అన్ని మతాల సారం ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడమేనని, రక్తదానానికి ముందుకు వచ్చిన యువకులను అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు.
రక్తదానం చేసిన యువకులకు ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రెటరీ రఘు కుమార్, జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, డివిజన్ సెక్రెటరీ జమీల్ హైమద్, బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జ్ డాక్టర్ శ్రీనివాస్, మర్కజి మిలాజ్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ఖాదిర్ అలీ, ఉపాధ్యక్షులు సయ్యద్ యాస్మిన్, సిద్ధికి రజా, సభ్యులు సమీర్ అలీ, అస్రార్, అజ్మత్, యూసఫ్, మస్రత్ మహమ్మద్, మత పెద్దలు పాల్గొన్నారు.