రెంజల్, అక్టోబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కునేపల్లి గ్రామంలో శనివారం మేడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ వారు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని సర్పంచ్ రొడ్డ విజయా లింగం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మెడికవర్ ఆసుపత్రి వారు కునేపల్లి గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
గ్రామంలో సుమారు 150 మందికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారన్నారు. డాక్టర్ రాధదీపక్ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందించేందుకు తమ హాస్పిటల్లో అన్ని రకాల వ్యాధులకు డాక్టర్లు అందుబాటులో ఉండి గుండె, కిడ్నీ మరియు నరాలకు సంబంధించిన వాటికి ఆరోగ్యశ్రీ లో భాగంగా ఉచితంగా సేవలు అందిస్తామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సాయిలు, లక్ష్మణ్, సంజీవ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.