కామారెడ్డి, అక్టోబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్, కార్మికుల, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, దోమకొండ, మద్నూర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశానికి మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్, రాష్ట్ర కార్యదర్శి హసీనా బేగం హాజరై మాట్లాడారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా నూతన జీవో 21 ప్రకారం వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కానీ వైద్య విధాన పరిషత్ చైర్మన్ ఆధ్వర్యంలో చర్చలు జరిగి జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, దోమకొండ, మద్నూరులలో పడకలను బట్టి వేతనాలు ఇవ్వాలని ఆయన అన్నారు. పిఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని అదేవిధంగా ఆస్పత్రుల్లో పని చేస్తున్న కార్మికుల సంఖ్యను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు జీవో ప్రకారం 18 వేలు చెల్లించాలని వారన్నారు. కానీ కొత్త కాంట్రాక్టర్లు 15 వేల 600 వేతనాన్ని పీఎఫ్ ఈఎస్‌ఐతో కలిపి చెల్లించుటకు చర్చల్లో అంగీకరించినట్లు వారన్నారు. ఇప్పటికైనా ఈ వేతనాన్ని కార్మికులకు అందే విధంగా ప్రభుత్వం చూడాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి బాలరాజ్, మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ జిల్లా నాయకులు ఎల్ దశరథ్, కార్మికులు ఫాజియా, లక్ష్మి, సునీత, సందీప్, సిద్ధిరాములు, రఫీక్, బాలకిషన్, మమత, పూజ, లావణ్య, జగన్, లక్ష్మి, రాజయ్య ఆయా ఆసుపత్రుల కార్మికులు పాల్గొన్నారు.