రైతు భీమా చెక్కు పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ రామరెడ్డి మండల పరిధిలోగల గొల్లపల్లిలో యువరైతు వజ్జపల్లి సురేష్‌ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలల్లో భాగంగా ఎక్కడ ఏ రైతు ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి ఒక్క గుంట భూమి ఉన్న రైతులకు రైతు భీమా ఇస్తున్నది, కావున ఎమ్మెల్యే సురేందర్‌ ఆదేశాల మేరకు గొల్లపల్లిలోని యువరైతు కుటుంబానికి బీమా చెక్కు అందించడం జరిగిందన్నారు.

గ్రామ సర్పంచ్‌ లావణ్య మల్లేష్‌ ఎమ్మెల్యే సురేందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు రైతు భీమా గుంట భూమి ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ నర్సయ్య, వార్డు సభ్యులు రాజయ్య, లింగం, రైతు బంధు అధ్యక్షుడు భూమయ్య, గ్రామ తెరాస అధ్యక్షుడు, గ్రామ తెరాస ఉపాధ్యక్షుడు కె.నరేష్‌, గ్రామ తెరాస యూత్‌ ఉపాధ్యక్షుడు జె.సుమన్‌, గ్రామ తెరాస నాయకులు అంజయ్య, సాయిలు, ప్రభాకర్‌, రాజమల్లయ్య, రమేష్‌, సత్యం, నర్సింలు, చింటూ నితిన్‌, నరేష్‌,పొయ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »