సిల్వర్‌ జూబ్లీ ప్రశంసా పురస్కారానికి బాలు ఎంపిక

కామారెడ్డి, అక్టోబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 15వ తేదీ శనివారం హైదరాబాదులోని తలసేమియా, సికిల్‌ సెల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సిల్వర్‌ జూబ్లీ ప్రశంస పురస్కారానికి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్‌ బాలును ఎంపిక చేశారు.

గత 15 సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా 67 సార్లు, రక్తదాతల సమూహం ద్వారా 15 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని, కరోనా సమయంలో 100 యూనిట్ల ప్లాస్మాను, డెంగ్యూ వ్యాధి సమయంలో ప్లేట్‌ లెట్స్‌ను అందించడమే కాకుండా తల సేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం రక్తదాన శిబిరంలో 189 యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకుగాను పురస్కారానికి ఎంపిక చేయడం జరిగిందని నిర్వాహకురాలు తెలిపారు.

అవార్డుకు ఎంపికైన డాక్టర్‌ బాలు మాట్లాడుతూ అవార్డు నా వ్యక్తిగత విజయం కాదని రక్తదానానికి సహకరిస్తున్న రక్తదాతలకు, ప్రోత్సహిస్తున్న వారికి, పత్రిక ప్రతినిధులందరికీ చెందుతుందని అన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »