నిజామాబాద్, అక్టోబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులోని మల్లారం వద్ద గల ప్రభుత్వ భూమిలో 80 ప్లాట్లను విక్రయించేందుకు వచ్చే నెల నవంబర్ 14 వ తేదీన వేలంపాట నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ప్రారంభ ధర ఒక్కో చదరపు అడుగుకు ఎనిమిది వేల రూపాయల ధర నిర్ణయించడం జరిగిందని, ఆసక్తి గల వారు బిడ్డింగ్‌లో పాల్గొని అధిక ధర పాడి నచ్చిన ప్లాట్‌ను సొంతం చేసుకోవచ్చని సూచించారు.
బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ముందుగా 10 వేల రూపాయల ధారావతు రుసుము చెల్లించాల్సి ఉంటుందని, బిడ్డింగ్ దక్కకపోతే ఆ మొత్తాన్ని వాపస్ చేస్తామని అన్నారు. బిడ్డింగ్ దక్కించుకున్న వారు 90 రోజుల వ్యవధితో మూడు విడతల్లో మొత్తం రుసుము చెల్లించే వెసులుబాటు ఉందన్నారు. డీటీసీపీ ద్వారా అనుమతి కలిగిన లే అవుట్ తో పాటు రోడ్లు, డ్రైన్లు, నీటి వసతి, విద్యుత్ సౌకర్యం ఇత్యాది సదుపాయాలు ఉందుబాటులో ఉన్నాయన్నారు. ఆసక్తి కలిగిన వారు వేలంపాటలో పాల్గొనాలని కలెక్టర్ సూచించారు.