ఎడపల్లి, అక్టోబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమ డిమాండ్ల సాధన కోసం 80 రోజులుగా సమ్మెలో ఉన్న వీఆర్‌ఏలు సమ్మెను విరమించారు. ఈ మేరకు విధుల్లో చేరుతున్నట్లు ఎడపల్లి మండల వీఆర్‌ఏ లు తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వీఆర్‌ఏల మండల అధ్యక్షుడు కుంట ఆబ్బయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతో వీఆర్‌ఏ జేఏసీ జరిపిన చర్చలు సఫలం అయ్యాయని, వీఆర్‌ఏల డిమాండ్లకు సీఎస్ అంగీకరించడంతో సమ్మె విరమించామన్నారు.
తమ డిమాండ్లకు అనుగుణంగానే కొత్త పే స్కేలు తీసుకురానున్నఉరని. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వచ్చే నెల 7 నుంచి కొత్త పే స్కేల్‌ను అమలుచేయ నున్నట్లు సీఎస్ తెలిపారని అన్నారు.
పేస్కేల్, ఉద్యోగ భద్రత, ప్రమోషన్ల విషయాలకు సంబంధించిన డిమాండ్లను ట్రెసా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ప్రభుత్వం ముందు ఉంచారని దీనికి ప్రభుత్వం కూడా సానుకూలంగానే ప్రకటించారన్నారు. మునుగోడు ఉప ఎన్నిక దృష్ట్యా నవంబరు 7 తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. వీఆర్‌ఏలు గురువారం నుంచే విధులకు హాజరయ్యారని అయన తెలిపారు.