రెంజల్, అక్టోబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలో ఈ నెల 28 నుండి నవంబర్ 30 వరకు చేపడుతున్న మనఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు భూమారెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని పల్లెపల్లెకు వివరించేందుకు మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే షకీల్ చేపట్టడం జరిగిందని కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్‌లు, రమేష్ కుమార్, వికార్ పాషా, కలీమ్ బేగ్, ఎంపీటీసీ హైమద్, బిఆర్‌ఎస్ నాయకులు రఫిక్, రాఘవేందర్, హాజిఖాన్, నర్సయ్య, కిష్టయ్య, లింగం, బాబు నాయక్, లింగారెడ్డి, గోపాల్ రెడ్డి, ముఖిద్, అన్వర్, సాయిలు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.