కామారెడ్డి, అక్టోబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిరుపేదలకు రేషన్, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యాన్ని పంపిణీ చేసి ఆహార భద్రత కల్పిస్తున్నాయని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ప్రపంచ ఆహార దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలకు ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా సంపూర్ణ ఆహారాన్ని అందిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ప్రసవం ఐన మహిళలకు కెసిఆర్ కిట్ ద్వారా ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఎస్‌ఓ రాజశేఖర్, ఆరోగ్య, ఐసిడిఎస్ అధికారులు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.