విద్యుత్‌ బకాయిలు వెంటనే చెల్లించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా గల అన్ని గ్రామ పంచాయతీలు విద్యుత్‌ బకాయిలను తక్షణమే చెల్లించేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్‌ శనివారం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామ సచివాలయాలు ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్‌) కు సుమారు రూ.35 కోట్ల వరకు విద్యుత్‌ బకాయిలు చెల్లించాల్సి ఉన్న అంశాన్ని కలెక్టర్‌ ప్రస్తావించారు. ఒక్కో డివిజన్‌ వారీగా పెండిరగులో ఉన్న విద్యుత్‌ బకాయిల గురించి డీఎల్పీఓ లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జీ.పీలు చెల్లించాల్సి ఉన్న విద్యుత్‌ బకాయిలను సుదీర్ఘ కాలం నుండి పెండిరగ్‌ ఉంచడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

ఈ పరిణామం జిల్లాకు కూడా చెడ్డ పేరు ఆపాదించే ప్రమాదం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆయా జీ.పీలు, అందుబాటులో ఉన్న నిధులను ముందుగా విద్యుత్‌ బకాయిల చెల్లింపులకే వినియోగించాలని కలెక్టర్‌ హితవు పలికారు. జీ.పీ ల ఖాతాల్లో అందుబాటులో ఉన్న వాటిలో కనీసం 80 శాతం నిధులను విద్యుత్‌ బకాయిల చెల్లింపులకే వెచ్చించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం సాయంత్రం లోగా ఎన్పీడీసీఎల్‌ పేరిట చెక్కులను ట్రెజరీలకు పంపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్‌ గా ఉన్నందున ఎవరు కూడా ఆషామాషీగా తీసుకోకూడదని అన్నారు. విద్యుత్‌ బకాయిల చెల్లింపులకు సర్పంచ్‌ లు, పాలకవర్గ సభ్యులు పూర్తి సహకారం అందించాలన్నారు. జీపీలలో అందుబాటులో ఉన్న నిధుల నుండి ముందుగా ఈ నెలలో తాజాగా వచ్చిన కరెంట్‌ బిల్లు మొత్తాన్ని చెల్లించాలని, మిగిలిన నిధులలో నుండి బకాయిల చెల్లింపులు జరపాలని కలెక్టర్‌ సూచించారు.

ఈ ప్రక్రియను రోజువారీగా సమీక్షిస్తూ, బకాయిల చెల్లింపులు జరిగేలా నిశితంగా పర్యవేక్షణ జరపాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాకు సూచించారు. కాగా, విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు ఆయా జీ.పీ ల పరిధిలో అవసరం లేని బోరు మోటార్లను తొలగించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. సెల్‌ కాన్ఫరెన్స్‌ లో డీఎల్‌పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »