ఎడపల్లి, అక్టోబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థి దశ నుండి విద్యార్థుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల అవగాహన పెంపొందించాలని ఇస్రో శాస్త్రవేత్త శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఇస్రో ఫేస్ వీక్‌లో భాగంగా ఎడపల్లి గురుకుల పాఠశాలలో పాఠశాల, కళాశాల విద్యార్థినిలకు ఇస్రో ప్రయోగాల గురించి వివరించారు.
విద్యార్థులు తమ భవిష్యత్తులో ఉద్యోగాలపైన ఆధారపడకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల మొగ్గు చూపాలని తద్వారా దేశానికి సేవ చేయాలని ఆయన పేర్కొన్నారు. సైంటిస్టులుగా మారి దేశ రక్షణ కోసం ప్రయోగాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా ఆయన ఇస్రో ప్రయోగాలతో సాధించిన విజయాలను ఆయన విద్యార్థినులకు వివరించారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్త శ్రీనివాసరావుకు పాఠశాల ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి జ్ఞాపికను అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల విద్యార్థినిలు, కళాశాల విద్యార్థినిలు అధ్యాపకులు పాల్గొన్నారు.