రెంజల్, అక్టోబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మండలంలోని వివిధ గ్రామాల నుండి అధికసంఖ్యలో కంటి సమస్యలున్న వారు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు.
130 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 38 మందికి మోతి బిందు ఆపరేషన్ కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సోమవారం తరలించనున్నట్లు మండల వైద్యాధికారిణి ప్రమోదితా తెలిపారు. కంటి పరీక్షలతో పాటు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశామన్నారు. శిబిరంలో డాక్టర్ ఉజుమా, ఆరోగ్య విస్తీర్ణాధికారులు సిహెచ్.శ్రావణ్, కుమార్, రవీందర్, మాలంబి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.