కామారెడ్డి, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 ప్రాథమిక పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్కే డిగ్రీ కళాశాల, సందీపని జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు.
పరీక్ష కేంద్రాలలో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు నిర్వహణ ప్రక్రియను చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో 9 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 4,549 అభ్యర్థులు ఉండగా వారిలో 3,712 మంది హాజరయ్యారు. 837 మంది గైరాజరైనట్లు చెప్పారు. 81.60 శాతం హాజరు నమోదు అయిందని ఆయన పేర్కొన్నారు.